మాజీ సైనికుల పిల్లలకు ఉపకార వేతనాలు
- October 06, 2015
2015-16 విద్యా సంవత్సరంలో వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న మాజీ సైనికుల పిల్లలు ప్రధానమంత్రి ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని సైనిక సంక్షేమాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీబీఎ, బీసీఎ, ఎంబీఏ, బీ ఫార్మసీ, బీ ఈడీ, ఎల్ఎల్బీ తదితర కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న అర్హత గల మాజీ సైనికుల పిల్లలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ. 24వేల నుంచి రూ. 27వేల వరకు ఉపకార వేతనం ఇవ్వ నున్నామన్నారు. ఇంటర్మీడియట్ మార్కుల అధారంగా కేం ద్రీయ సైనిక బోర్డు న్యూఢిల్లీ వారు విద్యార్థులను ఎంపిక చేశారని తెలిపారు. దరఖాస్తులను హ్త్త్//వ్వ్వ్. దెస్వ్.గోవ.ఇన్ వైబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి ఈ నెలాఖరులోగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో అం దజేయాలని కోరారు. మరిన్ని వివరాలకు 0878-22406 22 ఫోన్ నంబరులో సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







