కోలీవుడ్ లో అక్టోబర్ 16న రుద్రమదేవి
- October 06, 2015
గుణశేఖర్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించటం లేదు. పెద్ద సినిమాలు పోటిలో ఉన్నా బరిలో దిగేందుకు సిద్దమంటూ రిలీజ్ కు రెడీ అవుతున్న రుద్రమదేవికి టాలీవుడ్ లో లైన్ క్లియర్ అయినా కోలీవుడ్ లో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సినిమా తమిళ వర్షన్ ను ఒక వారం ఆలస్యంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట కోలీవుడ్ నిర్మాతలు. పులి సినిమా టాక్ పరంగా ఆకట్టుకోలేకపోయినా, కలెక్షన్ల పరంగా మాత్రం మంచి ఫాంలో ఉంది. దీంతో వెంటనే రుద్రమదేవి రిలీజ్ అయితే రెండు సినిమాల వసూళ్ల మీద ప్రభావం పడుతుందన్న ఆలోచనతో ఈ సినిమా రిలీజ్ ను ఒక వారం వాయిదా వేయాలని భావిస్తున్నారట. పులి సినిమాను తమిళనాట రిలీజ్ చేసిన తెనండల్ ఫిలింస్ రుద్రమదేవి సినిమాను కూడా రిలీజ్ చేస్తోంది. దీంతో అక్టోబర్ 16న రుద్రమదేవి తమిళ వర్షన్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ హిస్టారికల్ త్రీడి స్టీరియో స్కోపిక్ సినిమా అక్టోబర్ 9న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే తమిళ వర్షన్ ను కూడా అదే రోజు రిలీజ్ చేయాలని భావించినా ఆ అవకాశం కనిపించటం లేదు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







