రమదాన్‌ షేరింగ్‌ ఫ్రిజ్‌లు వచ్చేశాయ్‌

- May 22, 2017 , by Maagulf
రమదాన్‌ షేరింగ్‌ ఫ్రిజ్‌లు వచ్చేశాయ్‌

ఇయర్‌ ఆఫ్‌ గివింగ్‌లో భాగంగా ఇప్పటికే 35 షేరింగ్‌ ఫ్రిజ్‌లు రమదాన్‌ సందర్భంగా దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. రెడ్‌ క్రిసెంట్‌, ఓపెన్‌ ఆర్మ్స్‌ యూఏఈ సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేసింది. ఫేస్‌ బుక్‌లో రమదాన్‌ / షేరింగ్‌ ఫ్రిజ్‌ ట్యాగ్‌లతో ఆయా లొకేషన్లను తెలుసుకొనవచ్చు. ఎవరైనాసరే కొత్తగా ఈ షేరింగ్‌ ఫ్రిజ్‌లను ఏర్పాటు చేయదలచుకున్నా, ఫేస్‌ బుక్‌ ద్వారా సంప్రదించవచ్చు. డ్రింక్స్‌, ఫ్రూట్స్‌, వెజిటబుల్స్‌, బిస్కెట్స్‌, నట్స్‌ వంటివి కూడా రమదాన్‌ సందర్భంగా డొనేట్‌ చేయవచ్చు. తద్వారా చాలామందికి సాయం చేసినవారవుతారు. పవిత్ర రమదాన్‌ మాసంలో పేదరికంతో అల్లాడుతున్నవారికి ఆపన్న హస్తం అందించేందుకు చాలామంది ముందుకొస్తుండడం అభినందనీయం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com