2017 పింక్‌ కారవాన్‌ రైడ్‌లో 100 బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసుల గుర్తింపు

- May 22, 2017 , by Maagulf
2017 పింక్‌ కారవాన్‌ రైడ్‌లో 100 బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసుల గుర్తింపు

ఎమిరేట్స్‌లో నిర్వహించిన పింక్‌ కారవాన్‌ రైడ్‌ - బ్రెస్ట్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ ద్వారా 10 మాలిగ్నాంట్‌ క్యాన్సర్‌ కేసుల్ని కనుగొన్నారు. ఫ్రెండ్స్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ పేషెంట్స్‌ - ఎఫ్‌ఓసిపి ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. 2017 మార్చ్‌లో ప్రారంభించిన ఏడవ వార్షిక రైడ్‌ ద్వారా 7,108 ఉచిత మెడికల్‌ ఎగ్జామినేషన్స్‌ 7 ఎమిరేట్స్‌లో నిర్వహించారు. ఈ క్యాంపెయిన్‌ ద్వారా తెరపైకి వచ్చిన కేసుల్ని ఎఫ్‌ఓసిపి - పొటెన్షియల్‌ సపోర్ట్‌కి రిఫర్‌ చేశారు. మరో ఏడు కేసులు, ఇంకా బయాప్సీ రిపోర్ట్‌ల కోసం ఎదురుచూస్తున్నాయి. పింక్‌ కారవాన్స్‌ హైయ్యర్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ ఛైర్మన్‌ రీమ్‌ బింకారమ్‌ మాట్లాడుతూ, పది కేసుల్ని ఎఫ్‌ఓసిపికి పంపబడ్డాయనీ, ఆ బృందం పేషెంట్లతో టచ్‌లో ఉంటూ, అవసరమైన వైద్య సహాయంపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. క్యాన్సర్‌ చికిత్సలో ముందస్తు గుర్తింపు అత్యంత కీలకమని ఈ సందర్భంగా రీమ్‌ చెప్పారు. భాగస్వామ్య సంస్థలు, మెడికల్‌ అలాగే నాన్‌ మెడికల్‌ సిబ్బందికి ఈ సందర్భంగా రీమ్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com