ట్విట్టర్ కు గుడ్ బై చెప్పిన ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్
- May 25, 2017
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూనిగమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్‌కు గుడ్‌బై చెప్పారు. ట్విట్టర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ఆయన బుధవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేకాదు తన ట్వీట్లను త్వరగా స్క్రీన్షాట్లు తీసుకోవాలని కాసేపటి తర్వాత తన ట్వీట్లు కనిపించవని ఆయన మీడియాకు వెల్లడించారు. ట్విట్టర్లో సోనూ నిగమ్‌కు 70 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం... బాలీవుడ్‌కు చెందిన సీనియర్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ యాజమాన్యం నిషేధించినందుకు నిరసనగా సోనూ నిగమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 'నాకు 70 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వారికి గుడ్‌బై. చాలా మందిని నొప్పిస్తూ నేను ట్విటర్ నుంచి తప్పుకుంటున్నా. నా నిర్ణయం పట్ల కొందరు శాడిస్ట్లు సంతోషంగా ఉంటారు. నిద్రపోతున్న వారిని లేపగలం. కానీ నిద్రపోతున్నట్లు నటిస్తున్న వారిని లేపలేం..' అని సోనూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









