వాయిదా పడిన అఖిల్ సినిమా
- October 15, 2015
అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న తొలి సినిమా 'అఖిల్'. మాస్ స్పెషలిస్ట్ వివి వినాయక్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఈ సినిమా అనుకున్నట్టుగా దసరాకు రిలీజ్ కావటం లేదు. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కుతున్న అఖిల్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అఖిల్ ఇంట్రడ్యూసింగ్ సినిమా కావటంతో త్వరగా పని పూర్తిచేసి రిలీజ్ చేయడం కన్నా, పూర్తి క్వాలిటీతో రిలీజ్ చేయాలని భావించిన యూనిట్.., ఆలస్యం అయినా గ్రాఫిక్స్ క్వాలిటీ బాగా వచ్చాకే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. యంగ్ హీరో, అఖిల్ సినిమా నిర్మాత నితిన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో ప్రకటించారు. 'గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం అయిన కారణంగా అనుకున్న సమయానికి అఖిల్ సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాం, కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తాం.. సారీ ' అంటూ తన ట్విట్టర్ లో అభిమానులకు మెసేజ్ ఇచ్చాడు. డ్యూ తో దేలి ఇన్ గ్రాఫిక్స్ వర్క్ వ ర ఉనబ్లె తో రిలీజ్ అఖిల్ ఆన్ అక్టోబర్ 22న్ద్ ..సారీ ఫర్ ది దేలి ..విల్ అనౌన్స్ ది న్యూ రిలీజ్ డేట్ సూన్ ..సారీ .. - నిథీన్ (@ఆక్టర్ _నిథీన్ ) అక్టోబర్ 15, 2015
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







