భారతీయ కాన్సుల్ జనరల్‌ను కలిసిన తెలుగు ప్రవాసీ

- July 11, 2017 , by Maagulf
భారతీయ కాన్సుల్ జనరల్‌ను కలిసిన తెలుగు ప్రవాసీ

దుబాయ్: దుబాయ్ లో నూతన భారతీయ కాన్సుల్ జనరల్‌గా నియమితులైన విపుల్‌ను వివిధ ప్రవాసీ సంఘాల వారు మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ తమ సమస్యలను ప్రవాసులు ఆయనకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఇండియన్ పీపుల్స్ ఫోరం అనే ప్రవాస భారతీయుల స్వచ్చంధ సంస్ధ ప్రతినిధులు కాన్సుల్ జనరల్‌ను కలిశారు.
దుబాయ్, షార్జా నగరాల్లో తెలంగాణ ప్రవాసులు ఎదుర్కోంటున్న సమస్యలను వివరిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయవల్సిందిగా విపుల్‌ను కోరినట్లు సామాజిక కార్యకర్త జనగామ శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన శ్రీనివాస్ షార్జాలో పని చేస్తూ కష్టాల్లో ఉన్న ప్రవాసులకు చేతనైన సాయం చేస్తూ, ప్రమాదవశాత్తూ ఎవరైనా మరణిస్తే.. వారి మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు విశేష కృషి చేస్తుంటారు.  కాన్సుల్ జనరల్‌ను కలిసిన వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఉండగా అందులో తెలంగాణ నుండి శ్రీనివాస్, పందిళ్ళ మహెందర్ ఉన్నారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com