చైనాలోని మినీ బస్సుపై పడిన కన్ స్ట్రక్షన్ క్రేన్... ఏడుగురు మృతి

- July 12, 2017 , by Maagulf
చైనాలోని మినీ బస్సుపై పడిన కన్ స్ట్రక్షన్ క్రేన్... ఏడుగురు మృతి

ఓ కన్ స్ట్రక్షన్ క్రేన్ ముందుభాగం రోడ్డు మీద వెళ్తున్న ఓ మినీ వ్యాన్ పై పడటంతో బస్సులోని ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని పునింగ్ లో ఈ ఘటన జరిగింది. అక్కడ రోడ్డు పక్కనే ఓ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ జరుగుతున్నది. కన్ స్ట్రక్షన్ కోసం ఉపయోగించే క్రేన్ ముందుభాగం అదుపు తప్పి రోడ్డు మీద వెళ్తున్న ఓ మినీ బస్సు మీద పడటంతో ఆ బస్సు తుక్కుతుక్కయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు మరణించగా... ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com