ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ సీజ్

- July 22, 2017 , by Maagulf
ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ సీజ్

ఇందు గలదు.. అందు లేదు అన్న సందేహం వద్దు అన్నట్లు తయారైంది డ్రగ్స్‌ పరిస్థితి. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో... సరఫరా కూడా అదే స్థాయిలో ఊపందుకుంటోంది. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని ఓ విమానంలో డ్రగ్స్‌ ఉన్నట్లు గుర్తించారు. చెన్నై నుంచి వచ్చిన విమానంలోని ఫుడ్‌ ట్రాలీలో ఓ సీల్డ్‌ ప్యాకెట్‌ను సిబ్బంది గమనించారు. దాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ సిబ్బంది.. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కస్టమ్స్‌ కళ్లను దాటుకుని బయట నుంచి డ్రగ్స్‌ రావడం దాదాపు అసాధ్యం. అలాంటిది విమానంలోకి మత్తు పదార్థాలు వచ్చాయంటే.. అందులో కచ్చితంగా సిబ్బంది హస్తం ఉంటుంది. ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు విమానం సిబ్బంది వివరాలపై ఆరా తీస్తున్నారు. దాదాపు 2 కిలోల బరువున్న ప్యాకెట్‌లో ఉన్నది మార్ఫిన్‌గా భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com