ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాలకు మరో భారీ వర్ష సూచన

- July 25, 2017 , by Maagulf
ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాలకు మరో భారీ వర్ష సూచన

తెలుగు రాష్ర్టాలకు మరో భారీ వర్షసూచన రానుంది. ఈ నెల 28 లేదా 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణుడు భానుకుమార్‌ తెలిపారు. అప్పటి వరకూ చెదురుమదురు వర్షాలు కురుస్తాయన్నారు. ప్రస్తుతం ఉత్తరాది వైపుగా ఉన్న రుతుపవన ద్రోణి ఆగస్టులో దక్షిణాది వైపున ఎక్కువ రోజులు ఉంటుందన్నారు. వచ్చే నెల 15 తరువాత రుతుపవన వర్షాలు పెరుగుతాయని వెల్లడించారు. గోదావరిబేసిన్‌ ఆశాజనంగా ఉన్నా, కృష్ణా బేసిన్‌లో కుంభవృష్టి వర్షాలు తక్కువేనని ఆయన వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com