తిరుపతిలో గరుడ టెర్మినల్‌ను ప్రారంభించనున్న మోదీ

- October 20, 2015 , by Maagulf
తిరుపతిలో గరుడ టెర్మినల్‌ను ప్రారంభించనున్న మోదీ

అమరావతి శంకుస్థాపనకు విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీ తిరుపతిలోని రేణిగుంట విమానశ్రయంలో గరుడ టెర్మినల్ను ప్రారంభిస్తారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు తెలిపారు. ఎల్లుండి శంకుస్థపన కార్యక్రమం పూర్తవగానే అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు మోదీ వస్తారని అశోక్గజపతిరాజు చెప్పారు. మంగళవారం అశోక్గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ గరుడ టెర్మినల్ ద్వారా 500 మంది డొమెస్టిక్, 200 మంది ఇంటర్నేషనల్ ప్రయాణికులకు ఏర్పాట్లు చేస్తామని, సివిల్ ఏవియేషన్ అనుమతి రాగానే రాకపోకలకు అనుమతి కల్పిస్తామన్నారు. వారణాసి, భువనేశ్వర్ మాదిరిగా ఏపీలో కూడా అంతర్జాతీయ విమానాల అనుసంధానానికి కృషి చేస్తామని అశోక్గజపతిరాజు చెప్పారు. దేశ వ్యాప్తంగా 32 ఎయిర్పోర్టులు నిరుపయోగంగా ఉన్నాయని, పాత టెర్మినల్స్లో కార్గో విమానాలకు అనుమతి కల్పించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com