తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సద్దుల బతుకమ్మ ముగింపు ఉత్సవాలు

- October 20, 2015 , by Maagulf
తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సద్దుల బతుకమ్మ ముగింపు ఉత్సవాలు

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సద్దుల బతుకమ్మ ముగింపు ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా సిద్ధిపేట కొమటి చెరువు వద్ద జరుగుతున్న సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో మంత్రి హరీష్ రావు దంపతులు పాల్గొన్నారు. వరంగల్లో వేయిస్తంభాలు, పద్మాక్షమ్మ ఆలయంలో, భద్రకాళి, కాజీపేటలోని చెరువకట్టల సమీపంలో, నర్మెట్ట మండలం గండిరామారంలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ సీడినీ మంత్రి ఆవిష్కరించారు. మహబూబ్నగర్ జెడ్పీ గ్రౌండ్లో,షాద్ నగర్ లోని నెహ్రూ కాలనీ, అచ్చంపేట అయ్యప్ప దేవాలయంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. నల్లగొండ సూర్యాపేటలో జరుగుతున్న బతుకమ్మ సంబురాల్లో మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం పోచారంలో, ఖమ్మం జిల్లాలోని నయాబజార్ స్కూల్ గ్రౌండ్లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. వైరాలో జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే మదన్లాల్, ఇల్లందు బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. మహిళలు, అమ్మాయిలు, చిన్నారులు కోలాటాలు,నృత్యాలతో సద్దుల బతుకమ్మ ముగింపు ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com