చికెన్ చాప్స్
- July 30, 2017కావలసినవి: చికెన్- 800 గ్రాములు (8 ముక్కలుగా కట్ చేసుకోవాలి), కొత్తిమీర పేస్టు- ఒక టేబుల్‌స్పూను, పసుపు- అర టీస్పూను, మిరియాల పొడి- టీస్పూను, పచ్చిమిరపకాయలు-4, కారం-1/2 టీస్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు- 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ పేస్టు- ఒక కప్పు, టొమాటో గుజ్జు- ఒక కప్పు, ఉప్పు- తగినంత.
తయారీ విధానం: చికెన్ ముక్కలు తప్ప మిగతా పదార్థాలనన్నింటినీ ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఆ పేస్టును చికెన్ ముక్కలకు పట్టించి గంట సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత పెద్ద పాన్‌లో సరిపడా నూనె పోసి అది వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో పెట్టి నూనెలో ఒక్కొక్క చికెన్ ముక్క వేసి వేగించాలి. అలా ముక్కలన్నింటినీ దోరగా వేగించాలి. ఆ తర్వాత పాన్‌పై మూతపెట్టి మరో మూడు నిమిషాల పాటు దాన్ని ఉడకనివ్వాలి. ఇలా చేస్తే చికెన్ ముక్కలు మెత్తగా అయి వాటిల్లోని రసం ఆవిరైపోతుంది. అప్పుడు పాన్ని స్టవ్ మీద నుంచి కిందకు దించి ఉడికిన చికెన్ ముక్కలపై ముందుగా తరిగిపెట్టుకున్న కొత్తిమీర తరుగును చల్లి తింటే ఆ టేస్టే వేరు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ