అమెరికాలో మరో వైట్‌హౌస్‌ అధికారిపై వేటు

- August 03, 2017 , by Maagulf
అమెరికాలో  మరో వైట్‌హౌస్‌ అధికారిపై వేటు

 ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ ఎజ్రా కొహెన్‌ తొలగింపు 
 తాజాగా వైట్‌హౌస్‌కు చెందిన మరో వ్యక్తిపై వేటు పడింది. ప్రస్తుతం కొనసాగుతున్న వైట్‌హౌస్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌, ట్రంప్‌ జాతీయ భద్రతా సహాయకుడు ఎజ్రా కొహెన్‌-వాట్నిక్‌ను తొలగించారు. ఆయనను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వైట్‌హౌస్‌ వెల్లడించలేదు. ఎజ్రా కొహెన్‌ నాయకత్వంలో జాతీయ భద్రతా మండలిలోని ఇంటెలిజెన్స్‌ విభాగం చాలా బాగా పనిచేసిందని ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారు జనరల్‌ మెక్‌మాస్టర్‌ అభినందించారు. మార్చి నెల్లో ఆందోళనలు తలెత్తినపుడు కొహెన్‌ వాట్నిక్‌ స్థానంలో మెక్‌మాస్టర్‌ను నియమించాలని భావించారు. అయితే ఆ సమయంలో ట్రంప్‌తో మాట్లాడి తన పదవిని కాపాడాల్సిందిగా ట్రంప్‌ అత్యున్నత సలహాదారులను వాట్నిక్‌ కోరారు. 'ఎజ్రా మరో పదవిలో వుండి జాతీయ భద్రతకు విశేషమైన సేవలందించగలరని భావిస్తున్నట్లు జనరల్‌ మెక్‌మాస్టర్‌ విశ్వాసం వ్యక్తం చేశారని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఇప్పుడు కొహెన్‌ వాట్నిక్‌కు కొత్తగా ఇవ్వబోయే పదవి ఏమిటనేది వివరాలు వెల్లడి కాలేదు. ట్రంప్‌ పరివర్తనా బృందంలో కొహెన్‌ సభ్యుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com