ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు సీఎం రాఖీ గిప్ట్

- August 04, 2017 , by Maagulf
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు సీఎం రాఖీ గిప్ట్

సోమవారం రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర మహిళలకు కానుక ఇచ్చారు.  6వ తేదీ ఆదివారం అర్థరాత్రి నుంచి 7వ తేదీ సోమవారం అర్థరాత్రి వరకు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.  రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజు టిక్కెట్ లేకుండా ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ప్రకటించారు.  ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పోరేషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఉచితంగానే కాకుండా సురక్షితంగా కూడా ప్రయాణం చేయాలని అందుకు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను కూడా ఆదేశించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com