వెజ్ హసీనా
- August 04, 2017కావాల్సినవి: బ్రోకోలి - 100 గ్రాములు, జుక్నీ గ్రీన్ అండ్ యెల్లో- 100 గ్రాములు, క్యాబేజ్- 50 గ్రాములు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల క్యాప్సికమ్ - ఒక్కోటి, పచ్చిమిర్చి- రెండు, ఉల్లిపాయలు - ఐదు, టొమాటో- ఒకటి, జీడిపప్పు- నాలుగు, జీలకర్ర- ఒక టీ స్పూన్, గరం మసాలా- అర టీ స్పూన్.
తయారీ విధానం: కూరగాయలన్నీ సన్నగా తరగాలి. ఉల్లిపాయ గ్రేవీ తయారుచేయాలి. అందుకు పాన్లో నూనె వేసి వేడిచేయాలి. అందులో తరిగిన నాలుగు ఉల్లిపాయల ముక్కల్ని వేసి వేగించాలి. అవి వేగుతుండగా జీడిపప్పు, చిటికెడు పసుపు వేయాలి. అవికూడా వేగాక చల్లార్చి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. మరో పాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి జీలకర్ర, గరంమసాలా, టొమాటో ముక్కలు వేసి వేగిస్తూ కూరగాయ ముక్కల్ని కలపాలి. మంచి వాసన వచ్చేంతవరకు వేగించాలి. తర్వాత ఉల్లిపాయ గ్రేవీ కలిపి సన్నటి మంటమీద కూరగాయలు ఉడికేవరకు ఉంచాలి. వెజ్ హసీనాను రోటీతో తింటే ఆ రుచే వేరు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..