గ్రాఫిక్ వర్క్స్ దశలో 'అదిగో'

- August 06, 2017 , by Maagulf
గ్రాఫిక్ వర్క్స్ దశలో 'అదిగో'

'నచ్చావులే, అనసూయ, అల్లరి, అవును' వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రవి బాబు చేసిన గత రెండు చిత్రాలు 'అవును -2, లడ్డు బాబు' లు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈసారి ఒక పంది పిల్లని ప్రధాన పాత్రలో పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రానికి 'అదిగో' అనే టైటిల్ ను పెట్టారు. సినిమా షూట్ పూర్తై 8 నెలలు గడుస్తున్నా ఈ సినిమా ఇంకా విడుదలకు సిద్ధంకాలేదు. ఇంత ఆలస్యానికి కారణం ఏమిటా అని ఆరా తీయగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ భారీ స్థాయిలో ఉంటాయట. మధ్యలో కొన్ని కారణాల వలన నెమ్మదించిన ఈ పనులు ప్రసుతం బాగానే జరుగుతున్నాయని, గ్రాఫిక్స్ లో పర్ఫెక్షన్ కూడా ఆలస్యానియూకి ఒక కారణమని అంటున్నారు. ఈ గ్రాఫిక్ వర్క్ పూర్తి అయ్యేందుకు మరో రెండు నెలలు పడుతుందట.. అంటే ఈ మూవ డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com