అంతర్జాతీయ ఉద్యోగ కెరీర్ జాబితాలో టాప్‌-5 దక్కించుకున్న యూఏఈ

- August 08, 2017 , by Maagulf
అంతర్జాతీయ ఉద్యోగ కెరీర్ జాబితాలో  టాప్‌-5 దక్కించుకున్న యూఏఈ

దుబాయ్‌: అంతర్జాతీయ ఉద్యోగ కెరీర్‌కు అత్యంత అనువైన దేశాల జాబితాలో యూఏఈకి టాప్‌-5లో చోటుదక్కింది.సంపాదన, ప్రయోజనాల ప్యాకేజీల విషయంలో యూఏఈ దేశ కంపెనీలు బాగా అందిస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది.
విదేశాల్లో అత్యుత్తమ కెరీర్‌ను ఇచ్చే తొలి మూడు స్థానాల్లో స్విట్జర్లాండ్, జర్మనీ, స్వీడన్‌ ఉన్నాయి.హెచ్‌ఎస్‌బీసీ నిర్వహించిన వార్షిక సర్వే- 2015లో ఆరో స్థానంలో ఉన్న యూఏఈ తాజాగా తన స్థానాన్ని మెరుగుపరుచుకొని నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సర్వే కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27 వేల మంది అభిప్రాయాలు సేకరించారు.
సొంత దేశంలో కంటే యూఏఈలో ఎక్కువగా సంపాదిస్తున్నట్టు మూడో వంతు మంది చెప్పారు. ఈ కోవలో స్విట్జర్లాండ్‌ (75 శాతం), ఖతార్‌ (66) ముందున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com