స్టఫ్డ్ టమోటా
- August 09, 2017కావలసిన పదార్థాలు: పెద్దసైజు టమోటాలు- ఐదు, క్యారెట్ తురుము, తరిగిన క్యాప్సికమ్- అర కప్పు చొప్పున, పసుపు- పావు టీ స్పూను, కారం- ఒక టీ స్పూను, ధనియాల పొడి- ఒక టీ స్పూను, గరం మసాలా- ఒక టీ స్పూను, కొత్తిమీర- ఒక కట్ట, నూనె- ఒక టేబుల్ స్పూను, ఉప్పు- తగినంత.
తయారీ విధానం: బాణలిలో నూనె పోసి వేడెక్కాక టమోటాలు, కొత్తిమీర మినహా మిగిలిన పదార్థాలన్నిటినీ వేసి 5 నిమిషాలు వేగించి పక్కన పెట్టుకోవాలి. టమోటాలను పైభాగంలో కత్తిరించి లోపల గుజ్జు, విత్తనాలు తీసేసి వేగించి పెట్టుకున్న కూరను పెట్టాలి. తర్వాత పెనం మీద రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక ఈ స్టఫ్డ్ టమోటాలను కూర బయటికి రాకుండా జాగ్రత్తగా అమర్చి మూత పెట్టి ఉడికించాలి. చివరగా కొత్తమీర వేసి దించేయాలి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..