గోబీ కోఫ్తా కర్రీ
- August 11, 2017
కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్: మీడియం సైజుది, టమోటాలు: మూడు(ముక్కలు చేసుకోవాలి), ఉల్లిపాయలు: రెండు(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), మొక్కజొన్న పిండి: 50 గ్రాములు, పచ్చిమిరపకాయలు: మూడు లేదా నాలుగు, కారంపొడి: రెండు టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్ స్పూన్లు, టమోటా సాస్: మూడు టేబుల్ స్పూన్లు, జీలకర్ర: మూడు టేబుల్ స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: తగినంత, కొత్తిమీర: కొద్దిగా, శనగపిండి: 50 గ్రాములు
తయారీ విధానం: కాలీఫ్లవర్‌ను విడదీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో శనగపిండి, మొక్క జొన్న పిండి, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, జీలకర్ర, ఉప్పు వేసి కొద్దిగా గంటెజారుగా కలుపుకోవాలి. బాండీలో తగినంత నూనె పోసి కాగిన తరువాత పై మిశ్రమంలో ముక్కలు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టు కోవాలి.
ఉల్లిపాయ ముక్కలు కొన్నింటిని, టమోటా ముక్కలను కలిపి ముద్దగా చేసుకొని అదే నూనెలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, మిగిలిన కారం, టమోటా సాస్, రుబ్బిపెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఇది గట్టిపడుతున్న సమయంలో వేయించిపెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను జత చేసుకోవాలి. సన్నపు సెగన కూర గట్టిపడేంత వరకూ ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. ఇది వేడి వేడి అన్నం లేదా చపాతీల్లోకి మంచి రుచిగా వుంటుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







