బ్రిటన్‌లో తెలుగు బాలుడి ఘనత

- August 12, 2017 , by Maagulf
బ్రిటన్‌లో తెలుగు బాలుడి ఘనత

బ్రిటన్‌లో నివసిస్తున్న తెలుగు విద్యార్థి బండి యశ్వంత్‌(12) ప్రతిష్ఠాత్మక మెన్సా ప్రజ్ఞా లబ్ధి (ఐక్యూ) పరీక్షలో 162 స్కోర్‌ సాధించాడు. ఈ పరీక్షలో సాధించే అత్యధిక స్కోర్‌ ఇదే. మేథస్సును పరీక్షించి సభ్యత్వం ఇచ్చే బ్రిటన్‌కు చెందిన మెన్సా ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ ఐక్యూ పరీక్షలో ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ సాధించిన స్కోర్‌ 160. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొలకలూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దంపతులు బండి కృష్ణమోహన్‌, మాధవీలతల కుమారుడు యశ్వంత్‌. తెలుగు, ఆంగ్లం, ఫ్రెంచ్‌, స్పానిష్‌, జర్మన్‌ భాషల్లో యశ్వంత్‌ మాట్లాడగలడు. లాటిన్‌ కూడా కొద్దిగా తెలుసు. ప్రస్తుతం రష్యన్‌ భాష నేర్చుకుంటున్నాడు. సైన్స్‌, గణితం, అంతరిక్ష శాస్త్రం అంటే అత్యంత ఆసక్తి అని.. పారిశ్రామికవేత్త కావాలన్నది తన లక్ష్యమని యశ్వంత్‌ పేర్కొన్నాడు. ఏడో తరగతి పూర్తి చేసిన యశ్వంత్‌ వచ్చే నెలలో ఎనిమిదో తరగతిలోకి ప్రవేశించనున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com