అనారోగ్యంతో మంచంపై ఉన్న బాలిక అభ్యర్ధనకు స్పందించిన సౌత్ క్రౌన్ ప్రిన్స్
- August 14, 2017
ఎంతైనా మనసున్న మహారాజుల తీరే వేరని ఈ కధనం రుజువు చేస్తుంది. వైద్యం కోసం అమెరికాకు వెళ్లిన ఓ బాలిక అభ్యర్థనను మన్నించి తన దయాగుణాన్ని తెలియచేశారా సౌదీ యువరాజు . సౌదీ అరేబియా నుంచి అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలోని ఓ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న ఆ బాలిక తన ఆవేదనను వ్యక్తం చేస్తుండగా తీసిని వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నిన్న నా కాలుకు ఆపరేషన్ జరిగింది. ఇలాంటి సమయంలో మా అమ్మ నా పక్కన ఉంటే బాగుంటుంది. నాన్న, తాతయ్య ఇక్కడ ఉన్నా.. నాకు అమ్మను చూడాలని ఉంది. అమ్మ నాకు అన్నం తినిపిస్తోంటే నా కాలి నొప్పిని మర్చిపోగలననిపిస్తోంది.. ప్లీజ్ దయచేసి నాకు సహాయం చేయండి. సౌదీ రాజు సల్మాన్ గారూ.. మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తాడు.. నేనే మీ కుమార్తె లాంటిదాన్ని. ఈ చిన్న కుమార్తె కోరికను తీర్చలేరా..?’.. అంటూ విలపిస్తూ సౌదీ ప్రభుత్వాన్ని హలా అల్ ఎంజీ అనే పాప వేడుకుంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తల్లి లేకుండానే పాప వైద్యానికి ఆ కుటుంబం సిద్ధపడింది. పాప తండ్రి, తాతయ్య మాత్రమే ఆమెతోపాటు అమెరికాకు వెళ్లారు. పాప విన్నపాన్ని ఆన్‌లైన్‌లో వైరల్ వీడియో ద్వారా చూసిన సౌదీ క్రౌన్‌ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాప కోరికను తీర్చేందుకు సిద్ధమయ్యారు. ఆమె తల్లిని అమెరికాకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని, పాప వైద్యానికి అయే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. సౌదీ యువరాజు తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయనను దేశ ప్రజలు నెటిజన్లు ప్రశంసలతో అభినందిస్తున్నారు. చూసిన సౌదీ క్రౌన్‌ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాప కోరికను తీర్చేందుకు సిద్ధమయ్యారు. ఆమె తల్లిని అమెరికాకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని, పాప వైద్యానికి అయే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. సౌదీ యువరాజు తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయనను దేశ ప్రజలు నెటిజన్లు ప్రశంసలతో అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









