చాకో కేక్
- August 18, 2017కావలసినవి: మైదా ఒకటిన్నర కప్పులు, వంట సోడా ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు పావు టీ స్పూను, గుడ్లు 2, చక్కెర ఒకటిన్నర కప్పులు, నూనె అర కప్పు, పెరుగు ఒకటిన్నర కప్పు, వెనీలా ఎసెన్స్ ఒక టీ స్పూను, కోకో పౌడర్ ఒక కప్పు, కుకింగ్ చాకొలేట్ తురుము 100 గ్రా.
ఎలా చేయాలి
ముందుగా ఒవెన్‌ను 200 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో వేడి చేయాలి. మైదాలో వంటసోడా, ఉప్పు కలిపి జల్లించి పక్కన పెట్టుకోవాలి. గుడ్ల మిశ్రమంలో చక్కెరను వేసి ఐదు నిమిషాల పాటు గిలక్కొట్టాలి. ఈ మిశ్రమంలో నూనె కూడా పోసి మరి కొద్దిసేపు గిలక్కొట్టాలి. తర్వాత పెరుగు, వెనీలా ఎసెన్స్‌ను వేసి బాగా కలపాలి. తర్వాత మైదా మిశ్రమాన్ని, కోకో పౌడర్‌ను కూడా వేసి కలపాలి.
8 ్ఠ 8 సైజు గిన్నెలో నెయ్యి లేదా నూనె పూసి దానిలో కొద్దిగా మైదా పిండిని చల్లాలి. ఈ గిన్నెలో పై మిశ్రమాన్ని పోసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో 40 నిమిషాల పాటు బేక్ చేయాలి. కేక్ కొద్దిగా వేడిగా ఉండగానే కుకింగ్ చాకొలేట్‌ని దాని పైన పోసి చెక్క గరిటతో సమానంగా ఉండేలా సర్దాలి. రంగురంగుల స్ర్పింక్లర్స్‌ను పైన అందంగా అలంకరించాలి.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు