కొత్త లగేజ్ రూల్: ప్రయాణీకులకు అవగాహన
- August 22, 2017
మస్కట్: ఒమన్‌లో ఎయిర్‌లైన్స్ అలాగే ట్రావెల్ ఆపరేటర్స్, న్యూ బ్యాగేజ్ రూల్ పట్ల అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒమన్ ఎయిర్ పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఓఏఎంసి) ఈ కొత్త బ్యాగేజీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఫాస్టర్ పికప్స్, బ్యాగేజ్ జామ్స్‌ని తగ్గించి ఇబ్బందుల్లేని ప్రయాణానుభూతిని కల్పించేందుకే ఈ కొత్త విధానమని అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 నుంచి మస్కట్, సోహార్ సలాలా ఎయిర్‌పోర్టుల్లో గుండ్రంగా, ఇర్రెగ్యులర్‌గా ఉన్న బ్యాగ్‌లు, బ్లాంకెట్స్‌తో చుట్టినవి, రోప్స్‌తో కట్టిన బ్యాగేజీలను చెక్ ఇన్‌లోకి అనుమతించరు. అల్ హసర్ ట్రావెల్స్ జనరల్ మేనేజర్ ఎం మెహమూద్ మాట్లాడుతూ, ప్రయాణీకులకు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో కొత్త నిబంధనల్ని తెలియజేస్తున్నామని అన్నారు. ఆకాష్ యాత్రా ఎండీ ఎమ్దాద్ బచ్చు మాట్లాడుతూ, కొత్త బ్యాగేజీ విధానంపై అప్రమత్తంగా ఉన్నామనీ, తమ ప్రయాణీకులకు ఈ విషయమై అవగాహన కల్పించే చర్యలు ప్రారంభించామని అన్నారు. ఎయిర్ ఇండియా, సోషల్ మీడియా వేదికగా కొత్త నిబంధనలపై ప్రచారం చేస్తున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







