హైదరాబాద్‌లో 200 వాటర్ ఏటీఎంలు
- August 26, 2017
మేయర్ బొంతు రామ్మోహన్‌హైదరాబాద్: ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ నగరంలో 200 వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంను జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. వాటర్ ఏటీఎంను స్వీడన్ జోషెఫ్, నేచర్స్ స్ప్రింగ్ సంస్థలు ఏర్పాటు చేశాయి. జీహెచ్‌ఎంసీ, జలమండలి సహకారంతో ఇవి నడవనున్నాయి. ఈ ఏటీఎం ద్వారా రూ.1కి గ్లాసు, రూ.2కి లీటరు నీళ్లు, రూ.5కి 10 లీటర్లు, రూ.10కి 20 లీటర్ల నీళ్లు అందించనున్నారు. వాటర్ ఏటీఎం ఏర్పాటు సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలకు కాలుష్య రహిత మంచినీరు అందిస్తామని, అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలన్నదే లక్ష్యం అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









