గోపీచంద్ హీరోగా సౌఖ్యం
- October 26, 2015
ఇద్దరు మనుషులు ఎదురైనప్పుడు పెదాల మీద చిరునవ్వుతో పాటు మనసులోనుంచి వచ్చే మాటే `సౌఖ్యంగా ఉన్నారా` అని. ఎదుటివారి సౌఖ్యాన్ని గురించి ఆలోచించేది ఆత్మీయులే. అలాంటి ఆత్మీయులందరూ సౌఖ్యంగా ఉండాలనుకునే వ్యక్తి కథతో తెరకెక్కుతున్న సినిమా `సౌఖ్యం`. గోపీచంద్ హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాకు `సౌఖ్యం` అనే పేరును ఖరారు చేశారు. ఎ.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గోపిచంద్ సరసన రెజీనా నటిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు మినహా టాకీ పూర్తయింది. ఈ నెల 26 నుంచి నవంబర్ 7 వరకు విదేశాల్లో మూడు పాటలను చిత్రీకరిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాటలు చాలా హుషారుగా సాగుతాయన్నారు. స్విట్జర్లాండ్, ఆస్ట్రియాలో రఘు మాస్టర్ నేతృత్వంలో హీరో, హీరోయిన్‌పై మూడు పాటలను చిత్రీకరిస్తారు. మిగిలిన రెండు పాటలను హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. దాంతో మొత్తం సినిమా పూర్తవుతుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, జీవా, రఘుబాబు, కృష్ణభగవాన్, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, రఘు, శివాజీరాజా, సురేఖావాణి, సత్యకృష్ణ, సత్యం రాజేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు; శ్రీధర్ సీపాన, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్ : వివేక్, నిర్మాత: వి.ఆనంద్‌ప్రసాద్.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







