అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ అరెస్ట్
- October 26, 2015
దాదాపు రెండు దశాబ్దాలుగా భారత దేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలను వణికిస్తూ.. దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ అరెస్టయ్యాడు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం మేరకు అతడిని ఇంటర్పోల్ వర్గాలు ఇండోనేషియాలోని బాలిలో అరెస్టు చేశాయి. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహిత సహచరుడైన ఛోటా రాజన్.. ఆ తర్వాత అతడికి గట్టి ప్రత్యర్థిగా మారాడు. ముంబై పోలీసులు, భారత నిఘా ఏజెన్సీలు దాదాపు రెండు దశాబ్దాలుగా అతడి కోసం వెతుకుతున్నారు. 1995 నుంచి ఛోటా రాజన్ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇప్పటికీ ముంబై నేర సామ్రాజ్యంలో జరుగుతున్న అనేక ఘటనలలో అతడి హస్తం ఉందని చెబుతుంటారు. దావూద్ ఇబ్రహీం - ఛోటా రాజన్ వర్గాల మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. వాళ్లలో దావూద్ గ్యాంగ్ ఇప్పుడు ఛోటా రాజన్కు సంబంధించిన సమాచారం అందించి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. మన నిఘా సంస్థలు ఆ సమాచారం సేకరించాయో, లేదా వాళ్లెవరైనా ఇచ్చారో అప్పుడే చెప్పలేమని అంటున్నారు. భారతదేశానికి అతడిని డిపోర్ట్ చేసే అవకాశం ఉందని ఇండోనేసియా పోలీసులు, ఇంటర్పోల్ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







