మటన్ దాల్చ
- August 27, 2017కావలసిన పదార్థాలు: సొరకాయ - అరకేజీ, (లేత) మటన్ - అరకేజీ, శనగపప్పు - 1 కప్పు, టమోటా తరుగు - 2 కప్పులు, ఉల్లి తరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి -6, ఉప్పు - రుచికి తగినంత, కారం, పసుపు - అర టీ స్పూను చొప్పున, నూనె - 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం: శనగపప్పులో కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి వేసి మెత్తగా ఉడికించి, మెదిపి పక్కనుంచాలి. మటన్‌లో తగినంత నీరు పోసి కుక్కర్లో ఉడికించాలి. సొరకాయ క్యూబ్స్‌గా తరిగిపెట్టుకోవాలి. లోతైన కడాయిలో ఉల్లితరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, సొరకాయ ముక్కలు, టమోటా తరుగు, ఉప్పు, పసుపు, కారం ఒకటి తర్వాత ఒకటి వేసి కొద్దిసేపు వేగించాలి. ఉడికించిన మటన్, గ్లాసు నీరు కలిపి ఐదు నిమిషాల తర్వాత పప్పు మిశ్రమం, కరివేపాకు వేసి కొద్దిగా చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి. పలావు అన్నంతో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉండే కూర ఇది.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు