అత్యున్నత పురస్కారాలను అందుకున్న క్రీడాకారులు

- August 29, 2017 , by Maagulf
అత్యున్నత పురస్కారాలను అందుకున్న క్రీడాకారులు

హైదరాబాద్: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా క్రీడాకారులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అర్జున, ఖేల్‌రత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అవార్డులను ప్రదానం చేశారు.

ఈసారి క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ 'ఖేల్‌రత్న'ను రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన దేవేంద్ర ఝజారియా, హాకీ క్రీడాకారుడు సర్దార్‌ సింగ్‌ అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి పారా అథ్లెట్‌గా దేవేంద్ర నిలిచాడు. నలుగురికి ద్రోణాచార్య అవార్డులు లభించాయి.

మొత్తం 17 మంది క్రీడాకారులు ఈ ఏడాది అర్జున అవార్డుని అందుకున్నారు. వీరిలో క్రికెటర్లు పుజారా, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు ఉన్నారు. మరో ముగ్గురు ధ్యాన్‌చంద్ అవార్డులు అందుకున్నారు. ఇక, రాష్ట్రీయ ఖేల్‌ ప్రోర్ట్‌ అవార్డును రిలయన్స్‌ ఫౌండేషన్‌ యూత్‌ స్పోర్ట్స్‌ గెలుచుకుంది. ఈ అవార్డుని నీతా అంబాని అందుకున్నారు.

అవార్డు గ్రహీతలకు పతకం, ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతిని అందజేశారు. రాజీవ్ ఖేల్ రత్నాలకు రూ.7.5 లక్షలు, అర్జున, ద్రోణాచర్య, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలకు సర్టిఫికెట్‌తో పాటు రూ.5 లక్షల నగదు బహుమతిని అందజేశారు.

స్పోర్ట్స్ అవార్డుల జాబితా:

రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీతలు:

* Shri Devendra (పారా అథ్లెట్)

* Shri Sardar Singh (హాకీ)

ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు:

* Late Dr. R. Gandhi (అథ్లెటిక్స్)

* Mr. Heera Nand Kataria (కబడ్డీ)

* Mr. G.S.S.V. Prasad (బ్యాడ్మింటన్) లైఫ్ టైమ్

* Mr. Brij Bhushan Mohanty (బాక్సింగ్) లైఫ్ టైమ్

* Mr. P.A. Raphel (హాకీ) లైఫ్ టైమ్

* Mr. Sanjoy Chakraverthy (షూటింగ్) లైఫ్ టైమ్

* Mr. Roshan Lal (రెజ్లింగ్) లైఫ్ టైమ్

అర్జున అవార్డు:

* Ms. V.J. Surekha (ఆర్చరీ)

* Ms. Khushbir Kaur (అథ్లెటిక్స్)

* Mr. Arokia Rajiv (అథ్లెటిక్స్)

* Ms. Prasanthi Singh (బాస్కెట్ బాల్)

* Sub. LaishramDebendro Singh (బాక్సింగ్)

* Mr. CheteshwarPujara (క్రికెట్)

* Ms. Harmanpreet Kaur (క్రికెట్)

* Ms. OinamBembem Devi (పుట్‌బాల్)

* Mr. S.S.P. Chawrasia (గోల్ఫ్)

* Mr. S.V. Sunil (హాకీ)

* Mr. Jasvir Singh (కబడ్డీ)

* Mr. P. N. Prakash (షూటింగ్)

* Mr. A. Amalraj Table (టెన్నిస్)

* Mr. SakethMyneni (టెన్నిస్)

* Mr. SatyawartKadian (రెజ్లింగ్)

* Mr. Mariyappan (పారా అథ్లెట్)

* Mr. Varun Singh Bhati (పారా అథ్లెట్)

ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు:

* Mr. Bhupender Singh (అథ్లెటిక్స్)

* Mr. Syed Shahid Hakim (పుట్ బాల్)

* Ms. Sumarai Tete (హాకీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com