లవకుశ వచ్చేస్తున్నాడు

- September 03, 2017 , by Maagulf

ఎన్టీఆర్- రాశిఖన్నా-నివేదాథామస్ కాంబినేషన్‌లో రానున్న ఫిల్మ్ 'జై లవకుశ'. రిలీజ్‌కి సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ మొదలుపెట్టేసింది యూనిట్. ఇందులోభాగంగా రెండు పోస్టర్లను విడుదల చేసింది. ఒక పోస్టర్‌లో ముగ్గురు ఎన్టీఆర్‌లు కనిపించారు. మరొకదానిలో ఇద్దరు బ్యూటీలతో ఎన్టీఆర్ హ్యాపీగా వున్నాయి. దీనిపై అభిమానులు రకరకాలుగా అంచనాలు వేయడం మొదలుపెట్టారు. నార్మల్‌గా షెడ్యూల్ ప్రకారమైతే సెప్టెంబర్ మూడున ఆడియో ఫంక్షన్ జరగాల్సి వుండగా గణేష్ నిమజ్జనం, వర్షాలు వాయిదా పడింది. దీంతో ఆడియో సాంగ్స్ నేరుగా ఆదివారం మార్కెట్లోకి రానున్నాయి. ప్రీరిలీజ్ ఫంక్షన్ ఈనెల 10న జరగనుంది. ఇక రిలీజైన పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com