బహ్రెయిన్ యాత్రీకులంతా క్షేమం: జనరల్ కౌన్సిల్
- September 04, 2017
మనామా: బహ్రెయిన్ కౌన్సిల్ జనరల్ - జెడ్డా, ఇబ్రహీమ్ మొహమ్మద్ అల్ మెస్లిమని మాట్లాడుతూ, మక్కాలోని బహ్రెయిన్ యాత్రీకులంతా క్షేమమని తెలిపారు. హజ్ ప్రార్థనల్ని వారంతా ఎంతో ఆనందంగా జరుపుకున్నారని అధికారులు వివరించారు. కాన్సులేట్, బహ్రెయిన్ యాత్రీకులకు తగిన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని, ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితుల్ని తెలుసుకుంటోందని వారు చెప్పారు. హజ్ ప్రార్థనల్ని పూర్తి చేసుకుని, తిరిగి వస్తున్న యాత్రీకులకు సేవలందించేందుకోసం కాన్సులేట్ జనరల్ సభ్యులు, కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో సిద్ధంగా ఉంటున్నారని తెలిపారు. ఏ సమస్యలున్నాసరే, కాన్సులర్ ఆఫీస్‌ని 00966509757713 నంబర్లో సంప్రదించవచ్చునని కాన్సులేట్ పేర్కొంది. యాత్రీకుల కోసం అత్యద్భుతమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి, కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌కి కాన్సులేట్ కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్‌లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









