హైదరాబాద్లో మ్యూజిక్ మాస్ట్రో మ్యూజికల్ లైవ్ షో
- September 06, 2017
సంగీత ప్రియులకు శుభవార్త. ఫస్ట్ టైమ్ మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా కన్సర్ట్ హైదరాబాద్లో జరగనుంది. నవంబర్ 5న 85 మంది టీమ్ సభ్యులతో ఈ కన్సర్ట్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అయ్యే ఈ ప్రొగాం రాత్రి 10గంటల వరకు కొనసాగనుంది. ఈ కన్సర్ట్ కు గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియం వేదికా కానుంది. ఈ కన్సర్ట్ లో ప్రముఖ సింగర్స్ చిత్ర, సాధనాసర్గమ్, మనో, కార్తీక్ తో పాటు పలువురు గాయకులు పాల్గొననున్నారు. దాదాపు 6 వేల పాటలకు పైగా స్వర రచన చేసిన ఘనత ఇళయరాజా సొంతం. వెయ్యికి పైగా సినిమాలకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన అందించిన సంగీతం ప్రతిదీ హిట్టే.
వేదం అనువనువున నాధం (సాగరసంగమం), చుట్టు పక్కల చూడరా చిన్నవాడా (రుద్రవీణ), ఓ ప్రియా ప్రియా (గీతాంజలి), ఎదుటా నీవే (అభినందన), జగదానంద కారక (శ్రీరామ రాజ్యం), మాటే మంత్రము (సీతకోక చిలుక), లాలి జో లాలి జో (ఇంద్రుడు చంద్రుడు), సింగారాల పైరుళ్ళోన (దళపతి), . ప్రియతమ (జగదేక వీరుడు అతిలోక సుందరి), సుమం ప్రతి సుమం (మహర్షి), . బోటని పాట (శివ) ఇలా ఎన్నో పాటలకు ఆయన అందించిన సంగీతం హిట్ సూపర్ హిట్. అదే హిట్ నను డైరెక్ట్ గా కన్సర్ట్ రూపంలో తెలుగు వారికి అందించడానికి రెడీ అవుతున్నాడు ఇళయరాజా. సో హైదరాబాద్ గెట్ రెడీ....
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







