రాగి రొట్టె
- September 10, 2017కావలసిన పదార్థాలు : రాగిపిండి - 2 కప్పులు, ఉల్లిపాయ తరుగు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, కరివేపాకు తరుగు - 1 టేబుల్ స్పూను, పచ్చికొబ్బరి కోరు - 2 టేబుల్
స్పూన్లు, క్యాప్సికం తరుగు - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒక రొట్టెకు ఒక టీ స్పూను చొప్పున.
తయారుచేసే విధానం: ఒక వెడల్పాటి పాత్రలో కూరగాయల తరుగు, పిండి, ఉప్పు వేసి తగినంత నీటితో ముద్దలా చేసుకోవాలి. తర్వాత అరిటాకు పైన నూనె రాస్తూ కొంత కొంత పిండిని తీసుకుని రొట్టెలా సాధ్యమైనంత పలచగా ఒత్తుకుని పెనంపై కొంచెం నూనె వేసుకుని కాల్చుకోవాలి. వీటిని వేడివేడిగా టమోటా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ