అమెరికా ఫ్లోరిడాలో ఇర్మా విలయం ఘోరంగా నష్టం
- September 10, 2017
అమెరికాలో ఇర్మా విలయం కొనసాగుతోంది.. హరికేన్ గంటకు 14 మైళ్ల వేగంతో కదులుతుండగా.. కేటగిరీ త్రీ నుంచి 2కు ఇది తగ్గినట్టు అధికారులు ప్రకటించారు. ఇర్మా ప్రస్తుతం ఫ్లోరిడా కోస్జ్ దాటుతూ తంపా వైపు వెళ్తోంది. వరద ముప్పు అన్ని ప్రాంతాలనూ వణికిస్తోంది.. విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపోవడంతో ఫ్లోరిడా అంతటా 15 లక్షల కుటుంబాలకు పైగా అంధకారంలో మగ్గుతున్నాయి.
ఫ్లోరిడా అంతటా...భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.. ఇర్మా ప్రస్తుతం నేపుల్స్ దిశగా దూసుకెళ్తోంది. నార్త్ కోస్ట్ అంతటా 15 అడుగుల వరకూ వరద నీరు చేరవచ్చని ఫ్లోరిడా గవర్నర్ అలర్డ్ చేశారు. ఫోర్ట్ మైర్స్ మీదుగా దాటుతున్న ఇర్మా.. బలమైన గాలులతో విరుచుకుపడుతోంది. ప్రస్తుతం గాలులు గంటకు 105 మైళ్ల వేగంతో వీస్తున్నాయి. సెయింట్ పీటర్స్ బర్గ్, తంపా లాంటి నగరాలను ముంచెత్తుతూ ఇర్మా ముందుగు సాగుతోంది. రెండు నగరాల్లో నివసించే దాదాపు 5 లక్షల మంది నివసిస్తారు. ఇర్మా విలయం కొనసాగుతుండడంతో.. ఫ్లోరిడా అంతా వరదలు ముంచెత్తుతాయనే భయం వెంటాడుతోంది.. నగరాలన్నింటిలో అడుగుల మేర నీళ్లు చేరిపోతుండడంతో . ప్లోరిడా వెస్ట్ కోస్త్ అంతా వరద నీటిలో మునగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.. ఇది అధికారులను కంగారు పెడుతోంది. నేపుల్స్లో నాలుగు అడుగుల వరకూ నీళ్లు చేరాయి. మైర్స్, నార్త్ నేపుల్స్, దిశగా ఇర్మా ముందుకు వెళ్తోంది. గంటలోపే నేపుల్స్ లో నాలుగు అడుగుల నీళ్లు చేరడంతో నగరంలో 15 అడుగుల వరకూ వరదమంపు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇర్మా ధాటికి ఫ్లోరిడా ఘోరంగా నష్టపోయింది.. రాష్ట్రంలో దాదాపు ఎనిమిదో వంతు మంది చీకట్లలోనే ఉన్నారు. హరికేన్ ఫ్లోరిడా- తంపా తీరం దిశగా పశ్చిమ తీరం వైపు కదిలుతోంది. ఇర్మాకు ఫ్లోరిడాలో తీవ్రంగా నష్టం జరిగిందని అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటించారు. రాష్ట్రాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి కొన్ని వారాలు పట్టచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లోరిడా కోసం మేజర్ డిజాస్టర్ డిక్లరేషన్ ఆమోదించారు..
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







