తెలంగాణ ఉద్యోగులకు దసరాకు ముందే వేతనం
- September 11, 2017
- సీఎం ఆమోదానికి ఫైలు పంపిన ఆర్థిక శాఖ
దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల జీతం ముందుగానే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు పంపించింది.
ప్రతి నెలా 1న ఉద్యోగులకు నెల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఈనెల 29న సద్దుల బతుకమ్మ, 30న దసరా పండుగలు కావటంతో జీతాన్ని ముందుగా చెల్లిస్తే ఉద్యోగులకు పండుగ ఖర్చులకు ఉపయోగపడుతుందనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు సైతం ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. ఆర్థిక శాఖ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం లభించిన వెంటనే జీతాల ముందస్తు చెల్లింపుపై స్పష్టత రానుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







