ఫ్లోరిడాలోని వరద బీభత్సంతో ప్రజలు దోచుకుంటున్న దొంగలు

- September 11, 2017 , by Maagulf
ఫ్లోరిడాలోని వరద బీభత్సంతో ప్రజలు దోచుకుంటున్న దొంగలు

అమెరికాలోని ఫ్లోరిడా, మయామిలో ఓ వైపు వరద బీభత్సంతో ప్రజలు అల్లాడిపోతుంటే.. మరోవైపు దొంగలు దొరికినకాడికి దోచుకుంటున్నారు. ప్రాణభయంతో వ్యాపారులు షాపులు వదిలేసి వలసవెళ్లారు. అయితే, రాకాసి గాలుల బీభత్సానికి కొన్ని షాపుల్లో అద్దాలు ధ్వంసమయ్యాయి. మరికొన్ని చోట్ల తలుపులు పగిలిపోయాయి. దీన్ని అదునుగా చేసుకున్న దుంగుడులు.. అందిన కాడికి దోచుకుంటున్నారు. పనికొస్తుందా.? పనికి రాదా? అనేది కూడా చూడకుండా చేతికి ఏది దొరికితే అది భుజాన పెట్టుకుని పారిపోతున్నారు. అయితే, దొంగలే కాదు.. కొందరు సాధారణ పౌరులు కూడా ఇలా లూటీలకు పాల్పడుతున్నట్టు కెమెరాల్లో రికార్డయింది. అయితే, దొంగతనం జరుగుతున్న విషయం తెలిసి పోలీసులు అలర్ట్ అవ్వడంతో వారంతా పారిపోయారు. అయితే, లూటీ చేసిన వారిని వెంటాడి పట్టుకున్నారు పోలీసులు. 

ఇక భీకరమైన తుపాను ధాటికి.. నదులు, సరస్సుల్లో ఉండే మొసళ్లు ఊళ్ల మీదకు కొట్టుకొస్తున్నాయి. సొంత గూటికి వెళ్లే దారి తెలియక.. ఇళ్లలోకి చొరబడుతున్నాయి. రోడ్ల మీద ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com