సమయానికి వాహన రిజిస్ట్రేషన్ పునరుద్ధరించండి...కష్టాన్ని తగ్గించుకోండి

- September 12, 2017 , by Maagulf
సమయానికి వాహన రిజిస్ట్రేషన్ పునరుద్ధరించండి...కష్టాన్ని తగ్గించుకోండి

 తగిన సమయానికి వాహన రిజిస్ట్రేషన్ పునరుద్ధరించండి...మీ కష్టాన్ని తగ్గించుకోండని రాయల్ ఒమాన్ పోలీసులు సలహా ఇస్తున్నారు. తాము జరిమానా విధించడం, వాహనాలు స్వాధీనం చేసుకోకుండా ఉండటానికి వాహన యజమానులు తమ వాహనాల రిజిస్ట్రేషన్ (ముల్కియా) పునరుద్ధరించాలని కోరారు.  వాహన నమోదు, డ్రైవింగ్ లైసెన్స్, వీసా గడువు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై ముందే అప్రమత్తతని స్వీకరించడానికి 90085 నెంబర్ కు ప్రజలు ఎస్ఎంఎస్ పంపి ఆ సేవలను పొందవచ్చని చెప్పింది."చాలామంది వ్యక్తులు గడువు తీరిన రిజిస్ట్రేషన్ తో వాహనాలను నడుపుతున్నారని అటువంటివారికి   జరిమానా విధించారు. తాముప్రజలను కోరుకొనేది ఒకటేనని సరైన సమయపాలన పాటించమని కోరుకుంటున్నామని పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ చేయఁచడంలో మూడు నెలలు గడువు ధాటిఉంటే, ఆ వాహనం స్వాధీనం అవుతుందని రాయల్ ఒమాన్ పోలీస్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ నుండి ఒక అధికారి చెప్పారు. 30 రోజుల దయ కాలం ఏ జరిమానా లేకుండా వాహన నమోదు పునరుద్ధరించడానికి ఒక అవకాశమిస్తున్నట్లు తెలిపారు.  ప్రజలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇబ్బందులు ఎదుర్కొకోకుండా ఉండాలని రాయల్ ఒమాన్ పోలీస్ కోరింది. "ప్రజలు మరియు సంస్థలు కేవలం1 ఒమాన్ రియల్ ఖర్చుతో ఎస్ఎంఎస్ సభ్యత్వం పొందాలని పొందిన తేదీ నుండి ఆరు నెలల పాటు ఆ అప్రమత్తత సేవ చెల్లుబాటు అయ్యే విధంగా సౌకర్యం పొందవచ్చు." చందా కాలం ముగిసిన తర్వాత, వాహనదారుడు తన ఎస్ఎంఎస్ సభ్యత్వం చేసుకోలేకపోతే తనంతట తానె  స్వయంచాలకంగా పునరుద్ధరించబడుతుంది. సాదా అల్ నమనీ అనే  ఒక వ్యాపారవేత్త " మా గల్ఫ్ డాట్ కామ్ " తో  మాట్లాడుతూ, ఒకరోజు రాయల్ ఒమాన్ పోలీస్ తనిఖీ కారు రోడ్డుపై నన్ను ఆపివేశారు. లైసెన్స్ మరియు ముల్కీయలను చూపించమని ఒక అధికారి నన్ను అడిగాడు. ఒక రిజిస్ట్రేషన్ పునరుద్ధరించడానికి మర్చిపోయి ఉంటే చెల్లించాల్సిన ధర ఉందని అన్నారు. నా ముల్కియా మూడు నెలల క్రితమే గడువు కాలం  ముగిసింది. దాంతో వారు నా కారు స్వాధీనం చేసుకొన్నారు. నా కారుని విడుదల చేసుకోవడానికి నేను 50  ఒమాన్ రియల్ చెల్లించవలసి వచ్చింది. ఇటీవల నేను ఈ ఎస్ఎంఎస్ సభ్యత్వ సేవ గురించి తెలుసుకున్నాను. ఇది 50 ఒమాన్ రియల్ చెల్లించే బదులుగా 1 ఒమాన్ రియల్  చెల్లించటానికి ఉత్తమమని ఆయన తన అభిప్రాయం పంచుకున్నాడు. "

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com