దుబాయ్ లో అత్యవసర సేవలకు సూపర్ ఫాస్ట్ కార్లు

- October 31, 2015 , by Maagulf
దుబాయ్ లో అత్యవసర సేవలకు సూపర్ ఫాస్ట్ కార్లు

'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' లీగ్ కు సరితూగే సూపర్ ఫాస్ట్ కార్లు, దుబాయ్ కార్పొరేషన్ ఫర్ ఆంబులెన్స్ సర్వీసెస్ (డి.సి. ఏ. ఎస్.) వారి అమ్ములపొదీలో చేరనున్నాయి. ‘ఫాస్ట్ రెస్పాండర్' పేరుగల, అత్యంతాధునిక మెషిన్లు, హృదయ సంబంధ వివరాలు సేకరించగల మానిటర్లు గల ఈ కొత్త కార్ల శ్రేణి, ఏదైనా ప్రమాదం లేదా దుర్ఘటన జరిగినపుడు అంబులెన్స్ కంటే ముందు చేరి బాధితులను పరీక్షించి అతిముఖ్యమైన సమాచారాన్ని రాబట్ట గలదు.
గతనెల జరిగిన తొలి ప్రయత్నంలో,  షేక్ జాయెద్ జోన్ లోని ప్రమాద స్థలాన్ని కేవలం మూడు నిముషాల్లో చేరుకొనగలిగి, ఆంబులెన్స్ వచ్చేలోగా తీవ్రంగా గాయపడిన బాధితుని పరీక్షించి, అతన్ని ఆసుపత్రిలో చేర్చడానికి తయారుచేయగలిగామని డి.సి. ఏ.ఎస్. అధికారి ఒకరు వివరిం చారు. ఇంకా, ప్రమాదస్థలం నుండి సమీప వైద్యశాలకు సమాచారాన్ని చేరవేయగల సమాచార వ్యవస్థ కూడా ఈ వాహనాలు కలిగి ఉన్నాయని, తద్వారా ఆసుపత్రికి బాధీతుని చేర్చేలోగా వారు అవసరమైన ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉండగలరని ఆ అధికారి వివరించారు. తమ వద్ద ప్రపంచంలోనే అతి ఎక్కువసంఖ్య కలవిగా భావింపబడే, మూడు మాస్ కాజువాలిటీ బస్సులతో బాటు, వివిధ రకాలైన సుమారు 200 కు పైగా ఆంబులెన్స్ల శ్రేణి ఉందని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com