నిద్ర కరువైతే... సెల్ ఫోన్లు వాడితే.. కెలోరీలు ఖర్చు కావా?
- September 22, 2017
నిద్ర కరువైతే బరువు పెరిగిపోతారని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట పది గంటలకల్లా నిద్రకు ఉపక్రమించి.. ఉదయం పూట ఆరు గంటలకు నిద్రలేవాలి. దాదాపు 8 గంటల పాటు నిద్రపోనట్లైతే.. శరీర బరువు అమాంతం పెరిగిపోవడం ఖాయమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నిద్రలోపాల ద్వారా బరువు పెరగడమే కాకుండా అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. నిద్రలేమి ద్వారా శరీరం అలసటకు గురవుతుంది. అందుకే నిద్రించేందుకు అర గంట ముందు టీవీ లేదా మొబైళ్లను కట్టి పడేయాలి. సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు ఉపయోగించే వారు వాటిని దూరంగా ఉంచాలని పరిశోధనలో తేలింది.
చీకటిలో నిద్రించే వారితో పోలిస్తే, టీవీ, స్మార్ట్ ఫోన్, లాప్టాప్ వంటి కృత్రిమ వెలుగును అధిక సమయం వెచ్చించే వారిలో ఊబకాయం తప్పదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కృత్రిమ వెలుతురు కేలరీలను ఖర్చు చేసే బ్రౌన్ సెల్స్‌ను కూడా ప్రభావితపరుస్తాయట. తద్వారా కెలోరీలు ఖర్చు కాకుండా బరువు పెరిగిపోతారని, ఊబకాయంతో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటి ఇతరేతర వ్యాధులు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







