శరవేగంతో పూర్తి చేసుకుంటున్న రాజశేఖర్ నటిస్తున్నపి.ఎస్.వి గరుడవేగ 126.18ఎం'

- September 22, 2017 , by Maagulf
శరవేగంతో పూర్తి చేసుకుంటున్న రాజశేఖర్ నటిస్తున్నపి.ఎస్.వి గరుడవేగ 126.18ఎం'

''హీరోగా ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి కథ కోసం చూశా. ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు కుదిరింది. కథ విని ప్రవీణ్‌ హ్యాండిల్‌ చెయ్యగలడా? అనుకున్నా. 'మగాడు'లో కనిపించినంత పవర్‌ఫుల్‌గా చూపిస్తానన్నారు. ఆయన చెప్పింది చేసి చూపించారు'' అని రాజశేఖర్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పి.ఎస్.వి గరుడవేగ 126.18ఎం'. పూజాకుమార్‌, శ్రద్ధాదాస్‌ కీలక పాత్రధారులు. కోటేశ్వరరాజు నిర్మాత. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ ''బలమైన కథ, దానికి ధీటైన పాత్రలతో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. మా ఇంట్లో పెళ్లిలాగా ఈ సినిమా చేశాం'' అని అన్నారు. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ ''ఉగ్రవాదంలో భాగమైన అతీతశక్తుల్ని సమాజం నుండి బహిష్కరించడం అన్న ఇతివృత్తంతో రూపొందిన సినిమా ఇది. లార్జ్‌ స్కేల్‌ ఉన్న ఈ కథకు రాజశేఖర్‌లాంటి నటుడు కరెక్ట్‌గా సూట్‌ అవుతారనిపించి ఆయనతో చేశా'' అని చెప్పారు. పూజా కుమార్‌, జీవిత, ఆమె కుమార్తెలు శివాని, శివాత్మిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com