ఉగ్రవాద నిధిని సేకరించినా..ప్రోత్సాహించినా కఠిన జైలుశిక్ష ,తీవ్రమైన జరిమానాలు

- September 28, 2017 , by Maagulf
ఉగ్రవాద నిధిని సేకరించినా..ప్రోత్సాహించినా కఠిన జైలుశిక్ష ,తీవ్రమైన జరిమానాలు

మనామా: బహ్రెయిన్ లో తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపనున్నారు. దేశంలో లేదా వెలుపల తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొనేవారికి  " 10 సంవత్సరాల తక్కువ కాకుండా " జైలుశిక్ష, భారీ జరిమానాలు నిర్దేశిస్తూ ఒక డిక్రీని గురువారం కింగ్ హేమాడ్ బిన్ ఇసా అల్ ఖలీఫా జారీ చేశారు. డిక్రీ-లా 36/2017 ప్రకారం తీవ్రవాద నివారణ మరియు తీవ్రవాదం కోసం పెద్ద ఎత్త్తున నిధులను సమీకరించడం మరియు డబ్బులను పెట్టుబడిగా పెట్టడం నిషేధంపై డిక్రీ-చట్టం 4/2001 యొక్క ఆర్టికల్ 3 చట్టం సవరించారు. దీని ప్రకారం తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నవారికి "జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా  జైలు శిక్ష మరియు 100,000 బహ్రెయిన్ దినార్ల  కంటే తక్కువ కాకుండా జరిమానాలు విధించనున్నారు. అంతతేకాక తీవ్రవాదంను కొనసాగించేవారిపై 500,000  బహ్రెయిన్ దినార్ల కంటే ఎక్కువ మొత్తంలో జరిమానాను విధించాలని ఆ డిక్రీలో పేర్కొన్నారు. దేశంలో లేదా వెలుపల తీవ్రవాద కార్యక్రమంలో నిమగ్నమయ్యే సంఘం, సమూహం, సంస్థ, లేదా తీవ్రవాద ముఠాకి సంబంధించిన  ఆస్తులు, నిధులు లేదా వారి ఆదాయం పెంచడం, నిధులు ఇవ్వడం లేదా దాతగా సహాయం చేసే ఇచ్చే ప్రతి ఒక్కరిపై జరిమానా విధించనున్నారు. తీవ్రవాదం కోసం వారి ప్రయోజనం కోసం ఏదైనా కార్యకలాపాన్ని చేపట్టేవారు  లేదా ఏ విధంగానైనా తీవ్రవాదులకు మద్దతు పలికేవారు లేదా తీవ్రవాదులకు ఆర్థిక సహాయం అందించేవారు మరియు తీవ్రవాద కార్యకలాపంలో పాల్గొంటున్నవారు శిక్షలకు ఏ విధంగా అర్హులో శాసనం ఆర్టికల్ 3 పేరా (3-1) లో వివరంగా పొందుపర్చారు. దేశంలో లేదా వెలుపల తీవ్రవాద కార్యకలాపంలో పాల్గొనే వ్యక్తుల సమూహం లేదా ఆస్తి, నిధుల లేదా వారి ఆదాయాన్ని సేకరించడం, కేటాయించడం లేదా కేటాయించే వ్యక్తిపై అదేవిధంగా జరిమానా విధించబడిందని చెపుతుంది. తీవ్రవాదంను "అదే పద్ధతుల్లో" ప్రత్యక్షంగా లేదా మధ్యవర్తిత్వం ద్వారా ఏ విధమైన కార్యకలాపాలకు పాల్పడినా లేదా వాటి యొక్క ప్రయోజనం కోసం దోపిడీ చేయడానికి ఈ సంస్థల నుండి ఎలాంటి నిధులు తీసుకొన్న ప్రయత్నం కూడా" నేరం."పైన పేర్కొన్న నేరాలకు పాల్పడినప్పుడు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com