సింధు మీనన్ తల్లికి అందని సాయం

- September 29, 2017 , by Maagulf
సింధు మీనన్ తల్లికి అందని సాయం

మాయమైపోతున్నడమ్మా... మనిషన్న వాడు..పట్టపగలు నడి రోడ్డు మీద ప్రమాదం జరిగి.. సహాయం కోసం బాధితురాలు ఎదురు చూస్తున్నా స్థానికులు గానీ... అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ పట్టించుకోలేదు.. అలా గాయాలతో బాధితురాలు సహాయం కోసం గంటకు పైగా ఎదురు చూసింది... సాయం కోసం ఎదురుచూసిన బాధితురాలు ప్రముఖ నటి సింధు మీనన్ తల్లి శ్రీదేవి.. ఈ దారుణం బెంగళూరు లో చోటు చేసుకొన్నది. వివరాల్లోకి వెళ్తే...
బెంగళూరులోని మత్తికెరే సమీపంలోని ఎంఎస్.. రామయ్య ఆసుపత్రి నుంచి నటి సింధు మీనన్ తల్లి శ్రీదేవి ఆటోలో మల్లేశ్వరంలోని తన ఇంటికి బయలుదేరారు.. ఇలా వెళ్తున్న ఆటోని యశ్వంతపురం సిగ్నల్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన క్యాబ్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీదేవికి గాయాలయ్యాయి. ఆమె రోడ్డు మీద నిలబడి సహాయంకోసం ఎంతమందిని అర్ధించినా ఎవరూ పట్టించుకోలేదు.. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు సైతం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించకుండా... ఆటో, క్యాబ్ డ్రైవర్లలో ఎవరిది తప్పు అని ప్రశ్నించారు... ఈ విషయం తెలిసిన సింధు మీనన్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com