దుబాయ్ లో 2 లక్షల దిర్హామ్ల విలువైన పిల్లలదుస్తుల చోరీకి ప్రయత్నం
- September 30, 2017
దుబాయ్ : దేశం కానీ దేశంలో నమ్మకంగా విధేయంగా ఉండాల్సిన ఆ పాకిస్తాన్ ప్రవాసీయులు పార్ట్ టైం పనిగా దొంగతనాలను ఎంచుకొన్నారు. 21 మరియు 33 మధ్య వయస్సులో ఉన్న ముగ్గురు పాకిస్తానీ కార్మికులు ఒక దొంగల ముఠాగా ఏర్పడి రాస్ అల్ ఖోర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని దొంగతనం చేయటానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి, ఈ దొంగలు 2 లక్షల విలువైన పిల్లల దుస్తులను కలిగి ఉన్న గిడ్డంగి తాళు తెరవటానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడకు ఒక కారు రావడంతో వారు దానిని చూసి అక్కడ నుంచి పారిపోయారు. ఆ చోరుల ముఠా ఆగస్టు 4 వ తేదీన రాస్ అల్ ఖోర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని గిడ్డంగిని దోచుకోవాలని ప్రయత్నించారు, వారంతా 21 ఏళ్ళ నుంచి 33 ఏళ్ల వయస్సులో ఉన్న ముగ్గురు పాకిస్తానీ కార్మికులుగా వారిని గుర్తించారు. ఈ గిడ్డంగి ఒక చైనా వ్యాపారవేత్తకు చెందినది. కోర్టు అఫ్ ఫస్ట్ ఇన్స్టాన్ లో గిడ్డింగు యజమాని ఆ నేరం గూర్చి న్యాయాధికారులతో చెబుతూ, ఆ దొంగల ముఠా తన గిడ్డింగిలో దోపిడీకి విఫల ప్రయత్నం చేశారని విన్నవించారు. ఆగష్టు 3 వ తేదీన 2.30 గంటలకు, గిడ్డంగి యజమాని గిడ్డంగిని మూసివేశారు మరియు తాళం వేసినట్లు తెలిపారు. అయితే, ఆగస్టు 5 వ తేదీన 7 గంటలకు తనను పోలీసులు పిలిచారని యజమాని తెలిపారు. నేను గిడ్డింగు లోపల వస్తువులు తనిఖీ చేశాను, ఏదీ దొంగిలించబడలేదు, నేను సీసీ టీవీ ను తనిఖీ చేసాను మరియు ఆగస్టు 4 తేదీన రాత్రి 8.30 గంటలకు దొంగలు వచ్చారని కనుగొన్నారు. ముసుగులు ధరించిన ముగ్గురు దొంగలు ఒక పదునైన సాధనంతో తాళంను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించాయి.కానీ కారు వస్తున్నట్లు కనిపెట్టిన తర్వాత ఆ స్థలాన్ని తప్పించుకునేందుకు వారు మూడు గంటల సమయం తీసుకున్నారు '' అని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. సీసీ టీవీ రికార్డింగులతో, దొంగల బృందంలో ఒకరని స్పష్టమైన ఫోటోను గుర్తించాం ఆ నిందితుడి ద్వారా మిగిలిన సహచర దొంగలను ఆగస్టు 7 వ తేదీన పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.వీరిలో ఇద్దరు గతంలో ఈ దుస్తుల గిడ్డంగి యజమాని వద్ద బరువులు మోసే కూలీలుగా (పోర్టర్లుగా) పనిచేశారు. ముందుగా దొరికిన నిందితుడు తన స్నేహితుల దోపిడీ ప్రణాళిక గురించి తెలియదు అని వారితో పాటు సరదాగా వెళ్లేనని తెలిపాడు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







