అలా చేస్తే ట్రాఫిక్ జరీమానాల్లో 50 శాతం తగ్గింపు
- October 04, 2017
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా పోలీసులు, ఉల్లంఘనకు పాల్పడిన 50 రోజుల్లోగా జరీమానా చెల్లిస్తే, 50 శాతం జరీమానా తగ్గించేలా కొత్త ఆఫర్ని ప్రకటించారు. 'రాడార్' పేరుతో ఈ ఆఫర్ని రస్ అల్ ఖైమా పోలీసులు ప్రకటించడం జరిగింది. రాడార్ బేస్డ్ జరీమానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. 51 నుంచి 80 రోజుల లోపు చెల్లిస్తే, 30 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 80 రోజుల లోపు జరీమానా చెల్లించకపోతే, ఖచ్చితంగా పూర్తి జరీమానా వర్తిస్తుంది. అతి వేగంతో వాహనాలు నడపడం, నిబంధనల్ని ఉల్లంఘించడం ద్వారా ఇతరుల ప్రాణాలకు సైతం హాని కలిగించేవారవుతారు కాబట్టి, ఖచ్చితంగా వాహనదారులు తమ భద్రత కోసం, ఇతరుల భద్రత కోసం నిబంధనలు పాటించాలని రస్ అల్ ఖైమా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం, రెడ్ సిగ్నల్ జంపింగ్, రేసింగ్, కార్ విండోస్ ఓవర్ టింటింగ్ వంటి ఉల్లంఘనలకు ఎలాంటి డిస్కౌంట్ లభించదు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







