కడుపులో 30 కిలోల బంగారం.!
- October 09, 2017
దుబాయ్ నుంచి ఆదివారం రాత్రి మధురై విమానాశ్రయానికి వచ్చే విమానంలో భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా సాగుతున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులకు సమాచారం వచ్చింది. ఆ విమానం నుంచి దిగిన 60 మంది ప్రయాణికులను తనిఖీ చేసి స్కానింగ్‌లు సైతం తీయగా వీరిలోని 20 మంది కడుపులో బంగారాన్ని దాచిపెట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. చిన్నపాటి పాలిథిన్ కవర్లో 30 కిలోల బరువులున్న బంగారు బిస్కెట్లను పెట్టి మింగేసినట్లు అధికారులు తెలుసుకున్నారు. ఈ 20 మంది ప్రయాణికులను సోమవారం ఉదయం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ఎనిమా ఇచ్చి బంగారు బిస్కెట్లను బైటకు తీయించారు. వీరిలో కొందరు మహిళలు కూడా ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. మధురై విమానాశ్రయంలో 30 కిలోల బంగారు పట్టుబడటం ఇదే ప్రధమనని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







