వొడాఫోన్ తో ఐడియా విలీనంకి షేర్ హోల్డర్స్ ఓకే.!
- October 13, 2017
అతిపెద్ద టెలికాం కంపెనీ అవతరణకు మరో అడుగుపడింది. తన మొబైల్ వ్యాపారాన్ని వొడాఫోన్తో విలీనం చేసే ప్రతిపాదనకు ఐడియాకు చెందిన వాటాదారులు ఆమోదం తెలిపారు. గురువారం జరిగిన వాటాదారులు సమావేశంలో 99 శాతం మందికిపైగా ఈ విలీన ప్రతిపాదనకు అంగీకారం తెలిపారని ఆదిత్య బిర్లా గ్రూప్ తన ఫైలింగ్‌లో పేర్కొంది. అంతకుముందు ఇరు కంపెనీలు ఆమోదం కోసం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించాయి. ఎన్సీఎల్టీ సూచనల మేరకు ఐడియా వాటాదారుల సమావేశాన్ని నిర్వహించింది. తదుపరి దశలో టెలికాం శాఖ (డీవోటీ) అనుమతిని పొందాల్సి ఉంది. వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యూలార్ కంపెనీలు విలీనానికి ఈ ఏడాది మొదట్లోనే అడుగులు పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలూ విలీనం జరిగితే 35 శాతం వాటాతో 23 బిలియన్ డాలర్ల విలువైన అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది. ప్రస్తుతం వొడాఫోన్, ఐడియా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







