సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమతి సమంత

- October 14, 2017 , by Maagulf
సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమతి సమంత

వివాహం సందర్భంగా కొన్ని రోజులు సినిమా షూటింగ్‌ల నుంచి విరామం తీసుకున్న సమంత మళ్లీ సిన్సియర్ స్టూడెంట్‌లా షూటింగ్స్‌లో పాల్గొనబోతోంది.  ఈ రోజునుంచే 'మహానటి' చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సమంత ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఆ పాత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నాయట.  ఆ తరువాత 'రంగస్థలం‌'కి రానుందని సమాచారం. అటునుంచి కోలీవుడ్‌లో తను కమిట్ అయిన రెండు చిత్రాలు కూడా పూర్తి చేయనుంది.  ఇవన్నీ పూర్తయిన తరువాత తన బెటరాఫ్‌తో హనీమూన్ చెక్కేయనుందట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com