అనప బర్ఫీ
- October 15, 2017కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము- 1/2 కేజీ, నెయ్యి- 1 టేబుల్ స్పూను, పంచదార- 3/4 కప్పు, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, బాదం తురుము- 4 టీ స్పూన్లు, పచ్చి కోవా/పనీర్/కాటేజ్ చీజ్- 1/4 కేజీ
తయారీ విధానం: బాణలిలో నెయ్యి వేడి చేసి సొరకాయ తురుమును వేసి వేగించాలి. పదార్థం నుంచి నీరు విడుదలవుతుండగా పంచదార వేసి బాగా కలపాలి. మంట మధ్యస్థంగా ఉంచి నీరంతా ఆవిరి అయ్యే వరకూ కలుపుతూ వేగించాలి. తరువాత పనీర్/ కోవా/ కాటేజ్ చీజ్ల్లో ఏదో ఒక దానిని వేసి కావాలనుకుంటే గ్రీన ఫుడ్ కలర్ కూడా వేసుకుని బాగా కలిపి మరో ఐదు నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. ఆ తరువాత యాలకుల పొడి, బాదం తురుము వేసి కలిపి పదార్థాన్నంతా నెయ్యి రాసిన పళ్ళెంలో సమానంగా పరచి ఆరిన తరువాత ముక్కలు కోయాలి.
తాజా వార్తలు
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు