కువైట్ లో 26 మంది పురుషులకు స్త్రీల వేషం ధరింపచేసి .....
- October 16, 2017
కువైట్:' కూటి కోసం కోటి విద్యలు ' ...కానీ , ఈ విద్య కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంది. గల్ఫ్ దేశం కువైట్‌లో ఆశ్చర్యకరమైన ఓ విచితమైన విషయం వెలుగులోకి వచ్చింది. బతుకుదెరువు కోసం ఆసియాలోని వివిధ దేశాల నుంచి వలస వెళ్లినవారిని చేరదీసి ఓ గ్యాంగ్ వివిధ అకృత్యాలకు పాల్పడింది. డబ్బు సంపాదనే లక్ష్యంగా కొంతమంది కార్మికులపై హింసకు పాల్పడిన ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కువైట్ నగరంలో కొందమంది కార్మికులను ఓ గ్యాంగ్ నరకానికి గురిచేస్తోందని సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆసియా దేశాలకు చెందిన 26 మంది యువకులను బెదిరించి, వారితో ఆడవారిలా వేషధారణ చేయించి ఓ మసాజ్ సెంటర్‌లో అమ్మాయిలుగా పని చేయించారు. ఎదురుతిరిగితే చంపేస్తామని బెదిరించిన ఓ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులను హింసించి లైంగిక సంబంధ వ్యాపారం, మసాజ్ చేయడం, బ్యాటీపార్లర్‌ను నడిపించడం వంటి పనులు చేయించారు. బయటకు చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ ఘటన వెలుగులోకి రావడం కువైట్‌లో సంచలనంగా మారింది. చర్చనీయాంశంగా మారింది. ఈ నేరానికి పాల్పడిన నలుగురు సభ్యుల గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది ఆసియా దేశాలకు చెందినవారేనని, చంపేస్తామని బెదిరించి ఈ నేరానికి పాల్పడ్డారని అల్ రాయ్ పత్రిక వెల్లడించింది.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్‌కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









