పనీర్ బూరెలు..

- April 29, 2015 , by Maagulf
పనీర్ బూరెలు..

కావలసిన పదార్ధాలు:

  • కొబ్బరి తురుము         - 1 కప్పు
  • పనీర్                        - 1/2 కప్పు
  • పంచదార                  - 1 కప్పు
  • మైదా                       - 1 కప్పు
  • వరి పిండి                   - 2 కప్పులు
  • ఉప్పు                       - చిటికెడు
  • నూనె                        - వేయించటానికి సరిపడా

 

చేయు విధానం:

  • ముందుగా ఒక బాండీలో కొబ్బరి తురుము, పనీర్, పంచదార వేసి కొబ్బరి కాస్త బంగారు రంగు వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో మైదా, వరి పిండి, ఉప్పు వేసి కలిపండి. ఇప్పుడు పూత పిండికి సరిపడే విధంగా నీళ్ళు పోసి మిశ్రమం చేసి పెట్టుకోండి.
  • ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి మరియు పనీర్ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసి ఈ పూత పిండిలో ముంచి నూనె లో బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి.
  • అంతే ఎంతో రుచికరమైన మరియు పౌష్టికమైన పనీర్ బూరెలు రెడీ...

 

   ---  అమృత, దుబాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com